France Mother Body
Mom was sleeping: అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇద్దరు బాలికలు వారాల తరబడి స్కూల్‌కు రావడం లేదని కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన స్కూల్ అధికారులకు షాకింగ్ నిజం తెలిసింది. హఠాన్మరణం చెందిన తల్లి శవం దగ్గర కూర్చొని ఇద్దరు చిన్నారులు నిద్రపోతుందంటూ చెప్పడం వాళ్లను గందరగోళంలో పడేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
‘నిశ్శబ్ధంగా ఉండండి. అమ్మ నిద్రపోతుంది’ అని పోలీస్ ఆఫీసర్లకు సమాధానం చెప్తున్న చిన్నారులను చూసి అక్కడున్న వారి హృదయం ద్రవించిపోతుంది. 1990వ సంవత్సరంలో పుట్టిన ఆ మహిళ సహజ మరణంతోనే చనిపోయినట్లుగా పోస్టు మార్టంలో తేలిందని పోలీసులు చెప్తున్నారు. ఆ బాలికలు కొద్ది రోజులుగా తిండి తినకుండా ఉండటంతో వారిని హాస్పిటల్ లో చేర్పించాం. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించాం అని చెప్తున్నారు.
………………………………………: పక్కింటి కుక్కపై లైంగిక దాడి చేసిన 67ఏళ్ల వ్యక్తి
ఇప్పటి వరకూ చనిపోయిన తల్లి శవంతో ఎన్ని రోజులుగా గడిపారో అనే దానిపై క్లారిటీ లేదు. ‘క్రిమినల్ కేసు చేధించే కోణంలో అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నాం’ అని ప్రోసిక్యూటర్ అంటున్నారు. కొద్ది రోజులు వెయిట్ చేసి చూస్తే సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు వివరించారు.