Monkeys on Runway : ఎయిర్‌పోర్టులో కోతుల గ్యాంగ్ రచ్చ.. రన్‌వేపై మాస్ సీన్.. టేకాఫ్ టైంలో ఒక్కసారిగా..!
Monkeys on Runway : నింగిలోకి ఎగరాల్సిన విమానం రన్ వేపైనే ఆగిపోయింది. రన్ వైకి దిగాల్సిన విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇదంతా కోతుల కారణంగానే.. పైలెట్లు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
- Sreehari A
- Updated on- May 2, 2026 / 03:42 PM IST
Monkeys on Runway
- చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- ఒక్కసారిగా రన్ వైకి దూసుకొచ్చిన కోతుల గ్యాంగ్
- రన్ వైకి టేకాఫ్ అయ్యే సమయంలో ఘటన, పైలెట్లు అప్రమత్తం
Monkeys on Runway : రన్‌వేపై విమానం రెడీగా ఉంది. ఇంకో కొద్ది క్షణంలో నింగిలోకి ఎగరాల్సిన సమయం.. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రన్‌వే మధ్యలోకి కోతుల గుంపు దూసుకొచ్చింది. పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఎమర్జెన్సీ బ్రేకులు గట్టిగా కొట్టడంతో రన్ వైపై విమానం ఒక్కసారిగా ఆగిపోయింది. పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
అదే విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 170 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టేకాఫ్‌కు రెడీ అయిన ఇండిగో విమానం జస్ట్ 200 మీటర్లు వెళ్లగానే అంతరాయం కలిగింది.
టేకాఫ్ రద్దు చేసి ఫ్లయిట్ తిరిగి ఏప్రాన్‌కు తీసుకెళ్లారు. ఆపై అంతా తనిఖీలు చేశారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయ్యాక ఉదయం బయలుదేరాల్సిన విమానం గంట ఆలస్యంగా మళ్లీ రాయ్‌పూర్ దిశగా నింగిలోకి ఎగిరింది.
రన్‌వైపైకి దిగలేక ఆకాశంలోనే విమానం :
కోతుల వల్ల ఎయిర్ పోర్టులో రన్ వైపైకి విమానాలకు రాలేని పరిస్థితి ఎదురైంది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రన్‌వే క్లియర్ చేసేంతవరకు ఒక విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
ఫస్ట్ టైం ఘటన :
విమానాశ్రయంలో రన్‌వేపై కోతుల కారణంగా విమానాలకు అంతరాయం కలగడం ఇదే ఫస్ట్ టైమ్. రహీమాబాద్‌లోని మామిడి తోటల నుంచి ఈ కోతులు ఎయిర్ పోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించినట్టు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
