Varun Singh : భోపాల్ చేరిన వరుణ్ సింగ్ భౌతికకాయం..రూ.కోటి సాయం ప్రకటించిన సీఎం
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతిక కాయం ఆయన
- venkaiahnaidu
- Updated on- December 16, 2021 / 06:43 PM IST
Varun Singh2
Varun Singh : తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతిక కాయం ఆయన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. భోపాల్ విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు ఐఏఎఫ్ అధికారులు,మధ్యప్రదేశ్ మంత్రులు,సైనిక అధికారులు.
అనంతరం.. పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..వరుణ్ సింగ్ ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. వరుణ్ సింగ్ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు చౌహాన్ ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ సహా సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు చౌహాన్ స్పష్టం చేశారు.
ఏదైనా ఒక సంస్థకు వరుణ్ సింగ్ పేరు పెడతామని లేదా ఆయన విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఏం చేయాలో వరుణ్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నట్లు చౌహాన్ తెలిపారు. కాగా,శుక్రవారం వరుణ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
ALSO READ 1971 War Anniversary : అందుకు భయపడే..ఇందిర పేరును మోదీ సర్కార్ విస్మరించింది!
