Guinness Records: ఉల్లిపాయలాంటి చిన్నది..ఒక్క నిమిషంలో ఎన్నిడ్రెస్సులు మార్చిందో
60 సెకన్లలో 65 డ్రెస్ లు మార్చేసింది. తక్కువ వ్యవధిలో ఇన్ని డ్రెస్ లు మార్చి రికార్డు సాధించిందని గిన్నీస్ బుక్ రికార్డ్స్ నిర్వాహకులు వెల్లడించారు.
- madhu
- Published On : August 20, 2021 / 10:54 AM IST
Dress
Most Costume Change : మీరు డ్రెస్ మార్చుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే..ఆ..ఒక ఐదు నిమిషాలు పట్టవచ్చు. అంటారు. అదే ఆడవారి విషయానికి వస్తే…కొద్ది సమయం పట్టవచ్చు. కానీ..ఓ యువతి ఒక్క నిమిషంలో ఎన్నో డ్రెస్ లు మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రెస్ లు మార్చి..గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. మరి ఆమె ఎన్ని డ్రెస్ లు మార్చిందో తెలుసా ? 60 సెకన్లలో 65 డ్రెస్ లు మార్చేసింది.
Read More : National Education Policy 2020 : చదువు మధ్యలో మానేసినా, మళ్లీ చేరి చదువుకోవచ్చు
గిన్నీస్ బుక్ రికార్డ్స్ కు చెందిన నిర్వాహకులు ఓ వేదిక ఏర్పాటు చేశారు. అందులో ఓ యువతి నిలబడి ఉంది. ఆమెకు సమీపంలో ఓ పొడవైన క్లాత్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. నిర్వాహకులు స్టార్ట్ అనగానే..క్లాత్ ను యువతి పై నుంచి కిందకు..పైకి అన్నాడు. అంతే అప్పటి వరకు ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్…వెళ్లిపోయి బ్లూ కలర్ దుస్తుల్లో కనిపించింది.
Read More : YSRTP : షర్మిల పార్టీకి.. రాజీనామా చేసిన ఇందిరాశోభన్!
ఇలా..60 సెకన్లలో మొత్తం 65 డ్రెస్ లు మార్చేసింది. తక్కువ వ్యవధిలో ఇన్ని డ్రెస్ లు మార్చి రికార్డు సాధించిందని గిన్నీస్ బుక్ రికార్డ్స్ నిర్వాహకులు వెల్లడించారు. అంత తక్కువ వ్యవధిలో ఎలా మార్చిందబ్బా ? అంటూ నెటిజన్లు బుర్రగోక్కుంటున్నారు.
