ఈ బీజేపీ నేత నిజాయితీపరుడు : రాహుల్ గాంధీ

  • Publish Date - October 21, 2019 / 07:56 AM IST

అధికారంలో ఉన్న బీజేపీ నేతను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. బీజేపీలో అత్యంత నిజాయితీపరుడైన నేత ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. అదేంటీ.. అధికార పక్షంలో ఉన్న నేతను ప్రతిపక్ష నేత ప్రశంసించటమేంటి అనుకోవచ్చు..అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..ఓ వీడియోను షేర్ చేశారు.

హ‌ర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఓట‌ర్ల‌ను హెచ్చ‌రిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. అసంద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ..ఈవీఎంలో ఏ బ‌ట‌న్ నొక్కినా.. అది బీజేపీకే వెళుతుందనీ అన్నారు. ఓటరు ఏ బటన్ ప్రెస్ చేసినా.. తమకు తెలిసిపోతుందన్నా కూడా అన్నారు. 

ప్ర‌ధాని మోదీ చాలా తెలివైన వ్య‌క్తి..మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కూడా తెలివైన వ్య‌క్తే..ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు మీరు ఈవీఎంలో ఏ  బ‌ట‌న్ నొక్కినా.. అది బీజేపేకే వెళ్తుంద‌ని భ‌క్షిష్ సింగ్ విర్క్ అన్నారు. ఆ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్‌..బీజేపీలో అత్యంత నిజాయితీప‌రుడైన నేత ఈయ‌నే అంటూ దానికి క్యాప్ష‌న్ గా పెట్టారు.