Tomatoes as a gift : దుబాయ్ నుంచి కూతుర్ని 10 కేజీల టమాటాలు గిప్ట్గా తెమ్మన్న తల్లి
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
- Lakshmi 10tv
- Published on- July 19, 2023 / 06:39 PM IST
Tomatoes as a gift
Tomatoes as a gift : విదేశాల్లో ఉన్న మనవాళ్లు ఇండియా వస్తూ ఏం బహుమతి కావాలి అంటే.. మనకి ఇష్టమైనవి చెబుతాం.. కానీ ఓ తల్లి తన కూతుర్ని 10 కిలోల టమాటాలు అక్కడి నుంచి తీసుకురమ్మని బహుమతి అడిగింది. ఇండియాలో టమాటా రేట్ల పెరుగుదల ప్రభావం ఈ రేంజ్లో ఉందన్నమాట.
Anakapalli : ఇదేందయ్యా ఇది.. టమాటాలతో తులాభారం, నివ్వెరపోయిన జనం
ఇండియాలో టమాటా ధరలు భారీగా పెరిగాకా విచిత్రమైన కథనాలు వైరల్ అవుతున్నాయి. టమాటాల దొంగతనాల దగ్గర్నుంచి రీల్స్, వీడియోలు ఫుల్ హంగామా నడుస్తోంది. అయితే దుబాయ్లో ఉంటున్న తన సోదరి ఇండియా వస్తున్న సందర్భంలో తన తల్లి అడిగిన వింత కానుకను @Full_Meals అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసింది. ‘మా సోదరి తన పిల్లల వేసవి సెలవుల కోసం దుబాయ్ నుంచి ఇండియాకి వస్తోంది.. దుబాయ్ నుంచి ఏమైనా కావాలా? అని మా అమ్మను అడిగినపుడు ఆమె 10 కిలోల టమాటాలు తీసుకురండి అని చెప్పారు. తను నిజంగానే 10 కేజీల టమాటాలను ప్యాక్ చేసి పంపింది.. నేనేమంటానంటే…’ అనే శీర్షికతో పోస్ట్ చేసింది.
ఇక టమాటాలు ఇండియాకు వచ్చేసాయని ఆమె తరువాత ట్వీట్లో స్పష్టం చేసింది. తన తల్లి టమాటాలను ఊరగాయ లేదా పచ్చడి పెడుతుందని ట్విట్టర్ యూజర్ వెల్లడించింది. ఇటీవల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా కేజీ రూ.20 ఉన్న టమాటా ధర కాస్తా రూ.250 వరకూ చేరింది. ఇండియన్స్ విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి టమాటాలను బహుమతిగా తీసుకురమ్మని అడిగే స్ధాయి వరకూ టమాటాల ధరలు చేరుకున్నాయి. పూణేలో ఒక టమాటా రైతు ఒక నెలలో రూ.3 కోట్ల విలువైన పంటను అమ్మి బిలియనీర్ అయ్యాడట. సామాన్యులు మాత్రం పెరుగుతున్న టమాటా ధరలు చూసి లబోదిబో అంటున్నారు.
