Tomatoes As Birthday Gift : ఆమె పుట్టిన రోజుకు టమాటాలు బహుమతి .. కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న ఆమె ఎవరంటే..?

టమాటాల ధరల్లా నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగాలమ్మా..అంటూ దీవించారు పెద్దలు. టమాట ధరలు ఎంతగా పెరుగుతున్నాయో నువ్వు సుఖ సంతోషాలతో అంత ఎత్తుకు ఎదగాలి అంటూ టమాటాలు బహుమతిగా ఇచ్చి దీవించారు.

Tomatoes As Birthday Gift : ఆమె పుట్టిన రోజుకు టమాటాలు బహుమతి .. కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న ఆమె ఎవరంటే..?

Tomatoes As Birthday Gift for Women

Updated On : July 12, 2023 / 12:43 PM IST

Tomatoes As Birthday Gift for Women : పుట్టిన రోజు అంటే రకరకాల గిప్టులిస్తారు. పూల బొకేలు,టెడ్డీబేర్లు, చాక్లెట్లు ఇలా రకరకాల బహుమతులు ఇస్తారు. వారి వారి స్థాయిలను బట్టి వెండీ బంగారం కూడా గిప్టులుగా ఇస్తుంటారు. కానీ తాజాగా మీరు ఎవరికైనా ఖరీదైన గిఫ్టు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్ ‘టమాటా’కొనేయండీ కళ్లకద్దుకుని మరీ తీసుకోకపోతే అప్పుడు అడగండీ… ఏంటీ షాక్ అయ్యారా…టమాటాల ధరలు ఇచ్చే షాక్ కంటే ఇదేమీ పెద్దదికాదులెండీ..ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లీ కర్రీ ఏది అంటూ టమాటా కూరే అనేలా ఉంది. టమాటాల ధరలు అలా ఉన్నాయి మరి..అందుకే ఓ అమ్మాయికి వారి బంధువులు అందరు కలిసి ‘టమాటా’లు గిప్టుగా ఇచ్చారు. మరి ఆ గిస్టు ఎంత కాస్ట్లీ గిఫ్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా..

Tomato Price : బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్న వ్యాపారి ..

మహారాష్ట్ర (Maharashtra)లో కిలో టమాటాలు రూ.140 అమ్ముతున్నారు. దీంతో కల్యాణ్‌ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సోనాల్‌ బోర్సే అనే మహిళ ఆదివారం (జులై9,2023) పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె బంధువులు ఆమెకు టమాటాలు బహుమతిగా ఇచ్చారు.బంధువులు అందరు కలిసి 4 కిలోలకు పైగా టమాటాలు కానుకగా ఇచ్చారు. ఆ టమాటాలను చూసి ఆమె తెగ మురిసిపోయింది.

అంతేకాదు టమాటాలు బహుమతిగా ఇచ్చిన బంధువులు ఆమెను ‘ఆకాశమంత ఎదగాలి’ అని దీవించారు. తనకు పుట్టినరోజు కానుకగా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకొని కేక్‌ కట్‌ చేశారామె. తన సోదరుడు, బంధువులు ఇచ్చిన టమాటాల కానుక ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. నా సోదరుడు 2.15 కిలోల టమాటాలు, మా మామ అత్త ఒక్కొక్కరు 1 కిలో చొప్పున బహుమతి ఇచ్చారని తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా టమాటాలకు బౌన్సర్లు పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి ఉంది ప్రస్తుత పరిస్థితి. టమాటాల రేంజ అలా ఉంది మరి..

Tomato Price : మార్కెట్‌కు తరలిస్తున్న టమాటాల వాహనం చోరీ ..