Anakapalli : ఇదేందయ్యా ఇది.. టమాటాలతో తులాభారం, నివ్వెరపోయిన జనం

టమాటాను టచ్ చేయాలంటేనే భయపడిపోతున్న ఈరోజుల్లో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు టమాటాలతో..(Anakapalli)

Anakapalli : ఇదేందయ్యా ఇది.. టమాటాలతో తులాభారం, నివ్వెరపోయిన జనం

Tomato Tulabaram In Anakapalli

Anakapalli – Tomato Tulabaram : టమాటా.. ఇప్పుడీ పేరు వింటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వామ్మో టమాటా అనే పరిస్థితి వచ్చింది. టమాటాను టచ్ చేయడం అటుంచితే.. కనీసం దాన్ని చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దానికి కారణం టమాటా ధరలు భారీగా పెరిగిపోవడమే. అవును చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే టమాటా రేటు సెంచరీ దాటేసింది. ఇంకా ధరల మోత కంటిన్యూ అవుతోంది. త్వరలోనే టమాటా డబుల్, ట్రిపుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంత కాస్ట్లీ గా మారిపోయింది టమాటా.

టమాటాను టచ్ చేయాలంటేనే భయపడిపోతున్న ఈరోజుల్లో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు టమాటాలతో తులాభారం వేశాడు. ఏంటి షాక్ అయ్యారు కదూ. కానీ, ఇది నిజం. ప్రస్తుతం గోల్డ్ కన్నా టమాటాలకే ఎక్కువ క్రేజ్ ఉందని భావించాడో మరో కారణమో కానీ, టమాటాలతో తులాభారం నిర్వహించాడు.

అనకాపల్లిలో ఈ చిత్ర విచిత్రమైన సంఘటన జరిగింది. స్థానిక నూకాలమ్మ ఆలయంలో ఒక భక్తుడు అమ్మవారికి టమాటాలతో తులాభారం వేశాడు. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ టమాట ధర 120 రూపాయలకు పైగా పలుకుతోంది. ఇలాంటి సమయంలో ఈ తులాభారం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం టమాటాలు ఎంతో విలువైనవిగా మారిపోయాయి. బంగారం, వెండి కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించింది. వాటి కోసం దొంగతనాలు, మర్డర్లు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఆలయానికి వచ్చిన భక్తులు టామాలతో తులాభారాన్ని ఆసక్తిగా తిలకించారు. ఔరా అని నోరెళ్లబెట్టారు.

Also Read..Tomato : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. టమాటా ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ బోర్డులు చూసి కస్టమర్లు షాక్

అనకాపల్లికి చెందిన అప్పారావు తన కూతురు భవిష్యకు నూకాలమ్మ ఆలయంలో తులాభారం వేశారు. 51 కేజీల టమాటాలు తూగాయి. అనంతరం బెల్లం, పంచదారలతో తులాభారం ఇచ్చి తమ మొక్కును చెల్లించుకున్నారు. ఈ టమాటాలను అమ్మవారి నిత్య అన్నదానంలో వినియోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.

సాధారణంగా తులాభారం అంటే.. బాగా డబ్బున్నోళ్లు గోల్డ్ తో వేస్తారు. లేదంటే వెండితో వేస్తారు. చాలామంది బెల్లంతో తులాభారం వేస్తారు. కానీ, ఇప్పుడు టమాటా ట్రెండ్ నడుస్తోంది కదా. గోల్డ్, సిల్వర్ కన్నా టమాటాకే ఎక్కువ క్రేజ్ నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం టమాటా రైతుల దశ తిరిగింది. టమాట పండించిన పలువురు రైతులు కోటీశ్వరులు కావడం విశేషం.

Also Read..Tomato Farmers Millionaires : టమాటాలు పండించి కోటీశ్వరులైన రైతులు..