తల్లేనా : మూడేళ్ల పాపని గొడ్డుని బాదినట్టు బాదింది.. చిత్రహింసలు పెట్టింది

అమ్మ అంటే ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపం. పిల్లలను ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ

  • Publish Date - November 19, 2019 / 10:24 AM IST

అమ్మ అంటే ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపం. పిల్లలను ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ

అమ్మ అంటే ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపం. పిల్లలను ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ తల్లిడిల్లిపోతుంది. అందుకే తల్లిని దైవంతో సమానంగా చూస్తారు. కానీ.. ఆమె మాత్రం ఓ తల్లిలా కాకుండా నరరూప రాక్షసిలా ప్రవర్తించింది. కన్నకూతురిని గొడ్డుని బాదినట్టు బాదింది. పసి పిల్ల అనే కనికరం లేకుండా చావబాదింది. చిన్నారి 
జుట్టు పట్టుకుని, చెప్పుతో కొడుతూ చిత్రహింసలు పెట్టింది.

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ తన మూడేళ్ల కూతురిని అత్యంత దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసింది. చిన్నారి జుట్టు పుట్టుకుని, చెంపలు వాయించింది. అంతటితో ఆగకుండా చెప్పుతో చితకబాదింది. ఆ బాధను తట్టుకోలేక ఆ చిన్నారి ”కొట్టొద్దు..మమ్మీ” అంటూ చేతులు జోడించి వేడుకుంది. అయినా ఆ కర్కశ తల్లి రాతి గుండె కరగలేదు. చిన్నారి తండ్రి చాటుగా నిలబడి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు నువ్వు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యో పాపం అని కొందరు పాప పట్ల జాలి చూపారు. ఆ కర్కశురాలిని  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేయడం కామన్. అలాంటప్పుడు వారిని సుత్తిమెత్తగా మందలించడం లేదా రెండు దెబ్బలు వేయడం కామన్. కానీ ఈమె మాత్రం రాక్షసిలా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

దీనిపై కథువా పోలీసులు స్పందించారు. కూతురిని తల్లి కొడుతుండగా.. తండ్రి చాటు నుంచి వీడియో తీశాడని చెప్పారు. దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయని.. భర్త మీద కోపంతోనే ఆ మహిళ తన కూతురిని చావబాదిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఆమెని అదుపులోకి తీసుకున్నామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.