ఏనుగు తన అమ్మమ్మను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటో ఇటీవల వైరల్ అయింది. 39 సంవత్సరాల పోరీ అనే ఏనుగు 19సంవత్సరాల తనకూతురిని జర్మన్ జూలో కలుసుకుంది. అదే జూలో తమికా, ఫోర్, ఎలానీ, ఒన్ అనే మనవరాళ్లని కలుసుకుంది. పోరీ బెర్లిన్ నుంచి జర్మనీకి వెళ్లడంతో కుటుంబాన్ని కలుసుకోగలిగింది. న్యూస్ ఫ్లాష్ కథనం ప్రకారం.. క్లోజ్ డ్ టైంలో జంతువులను డోర్స్ లోపల ఉంచుతారు. ఆసమయంలో బయటి నుంచి చూసేందుకు వీలుంటుంది.
అయినా ఇంకా ఏనుగులను సపరేట్ బోనులోనే ఉంచుతున్నారు. కొద్ది రోజుల తర్వాత వాటన్నింటిని వదిలేసి ఒకే చోటే కలిసేందుకు వీలు కల్పిస్తారు. ఇలా ఏనుగులను కలుసుకోనివ్వడంతో కొత్త రిలేషన్లు మొదలవుతాయి. ఆడ ఏనుగులు తమ తల్లులను కలుసుకుంటాయి.
పోరీ అనేది ఆఫ్రికా ఏనుగు.. జింబాబ్వేలో 1981లో పుట్టింది. జర్మనీ మాగ్దెబర్గ్ జూలో ఉంచారు. అక్కడే 1983నుంచి 1997వరకూ ఉంది. టైర్‌పార్క్ బెర్లిన్ కు బ్రీడింగ్ కోసం ఉంచారు. 2001లో తానాకు జన్మనిచ్చింది.
సహజంగానైతే ఏనుగులన్నీ ఎప్పుడూ గుంపులుగానే ఉంటాయి. ఒక గ్రూపు నాయకుడితో మిగిలిన ఏనుగులన్నీ నడుస్తుంటాయి. కూతురు ఏనుగులు సాధారణంగా తల్లి ఏనుగులతో ఉండడానికే ప్రాధాన్యత ఇస్తాయి. మగ ఏనుగులు దీనికి విరుద్ధం.