కల్వర్టును ఢీకొని కాలువలో పడ్డ కారు : నలుగురు యువకులు మృతి

  • Publish Date - September 9, 2019 / 11:24 AM IST

మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా భోపాల్-ఇండోర్ రోడ్డుపై రోడ్డు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు.  భోపాల్ నుంచి ఇండోర్ వస్తున్న ఓ కారు జాతా ఖేడా గ్రామానికి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంపై  సమాచారం అందుకున్న పోలీసుటు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కారులో నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మరో రెండు మృతదేహాలు కారుకు కొంచెం దూరంలో పడి ఉన్నాయి. 
కారు ప్రమాదానికి గురైన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురు మృతి చెందగా మరో వ్యక్తి ఆచూకీ లభించలేదు. మృతులు నలుగురు భోపాల్ వాసులుగా గుర్తించారు. 

అషిమా మాల్ ఎదురుగా ఉన్న కార్ షోరూంలో పనిచేసేవారు. ఓ సమావేశానికి  హాజరు కావడానికి వీరంతా ఇండోర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదంలో కారు ప్రమాదానికి గురైంది. నలుగురు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలువల నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో సదరు వ్యక్తి  మృతదేహం ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.