మంత్రి పెద్ద మనస్సు: అనాధ పిల్లలకు ఫైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీ

  • Publish Date - October 28, 2019 / 09:56 AM IST

పండుగ అంటే కొత్త బట్టలేసుకుని మనమే పది రకాల పిండి వంటలు చేసుకుని తినటం కాదని నిరూపించారు మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీ.  దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఏదో ఓ టెంట్ వేసి నాలుగు రకాల వంటకాలు చేసే పెట్టలేదు. ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్ లో పేద పిల్లకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు.  ఎంపీ మంత్రి, కాంగ్రెస్ నేత, క్యాబినెట్ మంత్రి జీతూ పట్వారీ.

జీతూ పట్వారీ ప్రతీయేటా పెద్దపెద్ద హోటళ్లలో పేద పిల్లల సమక్షంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా దీపావళికి జీతూ పట్వారీ ఇండోర్ లోని రెడిసన్ హోటల్‌లో పేద, అనాథ చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. వారికి స్వయంగా తన చేతులతో వడ్డించారు. చక్కగా వారితో ముచ్చట్లాడుతూ కలిసి భోజనం చేశారు. చక్కటి గిఫ్టులు ఇచ్చారు. దీపావళి సందర్బంగా పేద పిల్లలకు పార్టీ ఇచ్చిన మంత్రి జీతూ పట్వారీని నెటిజన్లు అభినందిస్తున్నారు.