రాహుల్‌కు కోర్టు సమన్లు

  • Publish Date - August 31, 2019 / 05:08 AM IST

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ముంబై గిర్గావ్ మెట్రో పాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 03వ తేదీన వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. కమాండర్ ఇన్ థీఫ్ అని మాట్లాడారని..బీజేపీ కార్యకర్తలందరినీ రాహుల్ అగౌరవపరిచారంటూ బీజేపీ నేత శ్రీ మాల్ పరువు నష్టం దావా వేశారు.

పలు సందర్భాల్లో కాపలాదారుడే అంటూ మోడీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దీంతో కోర్టు సమన్లు పంపింది. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిదంటూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈ సందర్భంగా రాహుల్..మోడీని టార్గెట్ చేశారు. అనేక సభల్లో చౌకీదార్ చోర్ హై అంటూ విమర్శలు గుప్పించారు. మరి కోర్టు సమన్లతో అక్టోబర్ 03న వ్యక్తిగతంగా రాహుల్ హాజరవుతారా ? లేదా? అనేది చూడాలి.