Oxygen Cylinders Crisis: భార్య డయాలసిస్ పేషెంట్.. స్పేర్ సిలిండర్ తో సేవలందిస్తోన్న భర్త

కొవిడ్-19 ప్రభావంతో దేశమంతా వణికిపోతుంది. హెల్త్ కేర్ సిస్టమ్ అంతా అలర్ట్ వైద్య సదుపాయం అందిస్తున్నా కొన్ని చోట్ల సంక్షోభం వెన్నాడుతూనే ..

Oxygen Cylinder

Oxygen Cylinders Crisis: కొవిడ్-19 ప్రభావంతో దేశమంతా వణికిపోతుంది. హెల్త్ కేర్ సిస్టమ్ అంతా అలర్ట్ వైద్య సదుపాయం అందిస్తున్నా కొన్ని చోట్ల సంక్షోభం వెన్నాడుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ కొరతను కాస్త అయినా అధిగమనించాలని.. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మానవత్వంతో ఆలోచించి ఈ వ్యక్తి ముందడుగేశాడు.

డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న తన భార్య వద్ద ఎక్స్ ట్రా ఆక్సిజన్ సిలిండర్ ఉండటంతో అది వేరొక వ్యక్తికి ఇచ్చి ఉదారతను చాటుకున్నాడో ముంబైకు చెందిన అతను.

పాస్కల్ సల్దనా అనే వ్యక్తి మండల్ డెకరేటర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం తన భార్య సహకారంతో కొవిడ్ బాధితులకు సహకారం అందిస్తున్నాడు. నిస్వార్థంగా తన భార్య నగలు అమ్మి దీని కోసం ఖర్చు పెడుతున్నాడు.

ఇలా ఏప్రిల్ 18 నుంచి చేస్తున్నాను. కొన్ని సార్లు ఇతరులకు సేవ చేస్తున్నందుకు కొందరు నాకు డబ్బులు ఇస్తుంటారు. నా భార్య ఆక్సిజన్ సపోర్ట్ తో డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అందుకే మేం ఎప్పుడూ స్పేర్ ఆక్సిజన్ సిలిండర్ ఉంచుకుంటాం.

ఒకసారి స్కూల్ ప్రిన్సిపాల్ తన భర్తకు ఆక్సిజన్ కావాలని ఫోన్ చేసింది. అప్పుడే నా భార్య దగ్గర ఉన్న స్పేర్ సిలిండర్ అమ్మేశాం. తన రిక్వెస్ట్ మేరకు తన వద్ద ఉన్న రూ.80వేల నగలు అమ్మేసి ఇలా సర్వీస్ చేస్తున్నా.

దేశవ్యాప్తంగా కరోనా గురించి బాధపడుతుంటే పాస్కల్ లాంటి వాళ్లు ఆపద్భాంధవుడిలా మారిపోయాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో వయస్సు, హోదా పట్టించుకోకుండా వేల మంది సమాజసేవలో దిగిపోయారు. కుటుంబ సహకారంతో దేశం కోసం సహాయం చేస్తూ ఇన్ఫెక్షన్ల బారిన పడి హెల్త్ కేర్ సిస్టమ్ తో బాధపడుతుంటే నిర్విరామంగా సమయం కేటాయిస్తున్నారు.