ఎలుకల్ని చంపటానికి కోట్లు ఖర్చుపెట్టిన రైల్వే  

  • Publish Date - December 10, 2019 / 05:42 AM IST

ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రైల్వే శాఖ ఎన్నో జాగ్రత్తలు..చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రైళ్లు నడవటానికి అతి ముఖ్యమైనది రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ. దీనికి ఏమాత్రం అంతరాయం కలిగిన  భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. 

సిగ్నలింగ్ వ్యవస్థను ఎటువంటి అంతరాయం కలుగకుండా నడవాలంటే కొన్ని వేల వైర్లు సిగ్నలింగ్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థకు ఎలుకలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. సిగ్నలింగ్ వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. 

ఈ క్రమంలో ఎలుకలను చంపటానికి రైల్వేశాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకంటుంది. ఎప్పటికప్పుడు చెక్కింగ్ లు చేయిస్తుంటుంది. కోట్ల రూపాల్ని ఎలుకల్ని చంపటానికి ఖర్చు పెడుతుంటుంది. దీంట్లో భాగంగా పశ్చిమ రైల్వే గత మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు రూ. 1 కోటీ 52 లక్షల 41 వేల 689  ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఇంకా చంపాల్సిన ఎలుకలు ఎన్నో ఉన్నాయి. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ..కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తెలుస్తోంది. ఎలుకల్ని చంపటంలో ఆర్టీఐ పశ్చిమ రైల్వేను ప్రశ్నించగా దానికి సమాధానంగా పశ్చిమరైల్వే ఈ సమాధానమిచ్చింది.

ఇంటిలో ఒక్క ఎలుక చేరిందంటే నానా పాట్లు పడాల్సిందే. అటువంటిది వేలాది కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు ఎలుకల బెడదను నివారించటానికి ఖర్చు చేయటం అనివార్యంగా మారింది.