Surya Namaskar
Surya Namaskar: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్య నమస్కారం అంశాన్ని వ్యతిరేకించింది ఏఐఎమ్పీఎల్బీ. ముస్లిం విద్యార్థులు ఎవరూ ఇందులో పాల్గొనవద్దంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచించింది.
ఖలీద్ సైఫుల్లా రహమాని అనే వ్యక్తి.. ‘సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యూలర్ రిలీజ్ చేస్తూ 30వేల పాఠశాలల్లో సూర్య నమస్కారాన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఇండియా స్వాతంత్ర్యం సందర్భంగా ఇలా చేయాలని సూచించారు. ఇది కచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తొలగించడం వంటిదే’ అని అన్నారు.
జనవరి 1నుంచి స్కూల్స్ లో ఇది నిర్వహించాలని, జనవరి 26నుంచి మ్యూజికల్ ప్రోగ్రాం కూడా నిర్వహించాలని చెప్పారు. సూర్యనమస్కారం అనేది రాజ్యాంగంలో పేర్కొన్న అంశం కాదు. ఇది తప్పుడు దేశభక్తిని సూచిస్తుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుని సెక్యూలర్ భావాలను దేశంలో సజీవంగా ఉంచాలని’ కోరారు.
ఇది కూడా చదవండి : వావ్..మనిషి ఆకారంలో ఉండే గ్రామం..