Jai Shri Ram: జై శ్రీరామ్ అనాలని బలవంతం.. యువకుల అరెస్ట్

ఇద్దరు వ్యక్తులు కలిసి జై శ్రీరామ్ అనాలంటూ ఓ ముస్లిం వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jai Sri Ram (1)

Jai Shri Ram: ఇద్దరు వ్యక్తులు కలిసి జై శ్రీరామ్ అనాలంటూ ఓ ముస్లిం వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి జై శ్రీ రామ్ అనమని బెదిరిస్తుంటే.. మరొకరు అంటే ఏమైందని ప్రశ్నిస్తున్నాడు.

ముందుగా ఆ నినాదానికి నిరాకరించిన ముస్లిం వ్యక్తి.. ఇద్దరు కలిసి ఒత్తిడి తేవడంతో చివరకు జై శ్రీ రామ్ అని పలికాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది.

దీనిపై ఉజ్జయిన్ పోలీసులు కేసులు రిజిష్టర్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. పలు సెక్షన్ కేసులు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారని ఇండియా టుడేలో రాసుకొచ్చారు.