హిందూ మహిళలకు ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు. బీహార్ లోని మనెర్ ప్రాంతంలో చందూఖాన్ అతని మేనల్లుడు జావేద్ ఖాన్‌లు ఓ అనాథ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశారు.
మనెర్‌లో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనటానికి ఇది నిదర్శంగా కనిపించే ఈ ఘటనను పలువురు ప్రశంసిస్తున్నారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న 70 సంవత్సరాల దౌలతియా దేవి మనెర్ లోని మీరా చౌక్ లో చనిపోయింది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు పిల్లలు కూడా లేరు. దీంతో ఆమె ఒంటరిగానే జీవించి సోమవారం (డిసెంబర్ 2)న చనిపోయింది.
ఈ సందర్భంగా చందూఖాన్ మాట్లాడుతూ..దౌలతియా దేవికి అంత్యక్రియలు చేశామని హిందూ ధర్మం ప్రకారం 10 రోజుల తరువాత చేయాల్సిన అన్ని కర్మకాండలను కూడా చేస్తామని తెలిపారు.