ఆకాశం వైపు చూస్తే తెల్లని, నల్లని మేఘాలు, నీలి ఆకాశం కనపడతాయి. అలా కాకుండా గులాబీ, ఆకుపచ్చ, పసుపు రంగులు కనపడితే? చాలా ఆశ్చర్యపోతాం కదూ? చాలా మంది బెంగళూరు వాసులకు సోమవారం ఆకాశంలో ఇలాంటి రంగులే కనపడ్డాయి.
ఆ రంగులను చూసి మొదట్లో చాలా మంది బహువర్ణ మేఘాలుగా భావించారు. కొందరు వాతావరణంలో జరిగిన అసాధారణ విషయమని అనుకున్నారు. నగర వాసులంతా వీటిని చూస్తూ వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు.
ఆకాశంలో మిస్టరీ లైట్స్ కనపడ్డాయంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేశారు. ఆ మిస్టరీ లైట్లను ఏమంటారో తెలియదని, అవి మ్యాజికల్ లైట్లని కొందరు పేర్కొన్నారు. చివరకు కొన్ని జాతీయ మీడియా సంస్థలు దీనిపై పలు వివరాలు తెలిపాయి.
బెంగుళూరు మీది నుంచి తోకచుక్క దూసుకెళ్లడం వల్లే ఈ మిస్టరీ లైట్లు వచ్చాయని చెప్పాయి. అది సీ/2023 ఏ3 (సుచిన్షాన్-అట్లాస్) తోకచుక్క అని ”ది హిందూ” వార్తా సంస్థ పేర్కొంది. హాలీ తోకచుక్కను అప్పుడప్పుడూ చూస్తుంటాం, అది ఎప్పుడు దూసుకొస్తుందనే విషయాన్ని నిపుణులు అంచనా వేస్తారు. అయితే, సీ/2023 ఏ3 మాత్రం హాలీ తోకచుక్కలా కాదు. సీ/2023 ఏ3 తోకచుక్క ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేరు.
ఈ నాన్ పీరియాడిక్ తోకచుక్కలు మన సౌర వ్యవస్థకు అవతల ఉంటాయని ఓ ఖగోళ శాస్త్రవేత్త తెలిపారు. గత రెండు రోజులుగా బెంగుళూరు వాసులకు ఇది కనపడుతోంది. ఈ సీ/2023 ఏ3ని గత ఏడాది జనవరిలో చైనాలోని పర్పుల్ మౌంటైన్ అబ్జర్వేటరీ కూడా గుర్తించింది. డెక్కన్ క్రానికల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వాసులు కూడా అక్టోబర్ 2లోపు ఈ తోకచుక్కను చూసే అవకాశం ఉంది.
Bengaluru skies being just magical!
What is this phenomenon even called? pic.twitter.com/Uvhl4OgvmU
— Vihar Vaghasiya (@vihar73) September 30, 2024
Turkish Influencer : అందుకే నేను చనిపోతున్నాను.. భవనంపై నుంచి దూకి టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య..!