Narcotics : బోర్డర్ లో రూ.25కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

సరిహద్దుల గుండా భారత్ ​లోకి భారీగా డ్రగ్స్​ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

Drugs

Narcotics సరిహద్దుల గుండా భారత్ ​లోకి భారీగా డ్రగ్స్​ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్ముకశ్మీర్​ లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్​లోని నియంత్రణ వెంబడి అనుమానిత కదలికలను గుర్తించిన సైనిక బలగాలను  తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో మూడు డ్రగ్స్​  నింపిన మూటలను సరిహద్దులో వదిలేసి పరాపోయారు దుండగులు.

పాకిస్తాన్​ మార్కింగ్​ ఉన్న ఈ సంచుల్లో సుమారు 25-30 కిలోల డ్రగ్స్(హెరాయిన్)ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం స్థానిక పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ రూ.25కోట్లు ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలంలో ఓ టోపీ, చిన్న బ్యాగులు, కొన్ని సంచులను స్వాధీనం చేసుకున్నట్లు బారముల్లా ఎస్ఎస్​పీ రయీస్​ మహమ్మద్​ భట్​ చెప్పారు. పోలీసులకు డ్రగ్స్​ను అప్పగించిన తర్వాత విచారణ ప్రారంభమవుతుందని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు.

ALSO READ  Drugs Into India : భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా

మరోవైపు,జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్‌ గ్రామం వద్ద పాక్‌ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్‌ వస్తువులు జారవిడవడాన్ని గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గ్రామాన్ని అధీనంలో తీసుకుని సెర్చ్​ ఆపరేషన్ ప్రారంభించారు. ఆయుధాలతో కూడిన ఓ పార్సిల్​ను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్​ నుంచి అక్రమంగా డ్రోన్​ ద్వారా జమ్ములోని వ్యక్తులకు చేరవేసే క్రమంలో జారిపడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.