అంగారకుడిపై వచ్చిన తొలి ప్రకంపనాలు రికార్డయ్యాయి. నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్’ అంతరిక్ష నౌక శబ్దాలను గుర్తించింది. సిస్మిక్ ఎక్స్‌పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ (ఎస్ఈఐఎస్) అనే పరికరం దీనిని గుర్తించిందని నానా వెల్లడించింది. ఏప్రిల్ 06వ తేదీన రికార్డు చేసినట్లు తెలిపింది. గత ఏడాది మేలో ఇన్ సైట్‌ను ప్రయోగించింది. డిసెంబర్ ెలలో సిసిమో మీటర్‌ను అంగారకుడిపై ఉంచింది. ప్రకంపనల సమయంలో చిన్నపాటి శబ్దం వినిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం వెల్లడిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇప్పటి వరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10 – 11 తేదీల్లో చిన్న చిన్న శబ్దాలు సిసిమో మీటర్ గుర్తించింది. అసలు ఈ శబ్దాలు ఎలా వచ్చాయి అనే దానిపై ప్రస్తుతం వారు దృష్టి సారిస్తున్నారు. మరి అంగారకుడి లోపల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే దానిపై ప్రస్తుతం ఉన్న సమాచారం సరిపోదని అంటున్నారు. వాతావరణం చల్లబడుతున్న సమయంలో పీడనం పెరుగుతుందని..తద్వారా చంద్రుడిపై పగుళ్లు ఏర్పడుతాయని అందుకే ప్రకంపనాలు చోటు చేసుకుంటాయని తెలిపారు.