NASA: ఢిల్లీ మాత్రమే కాదు.. పాకిస్తాన్, బంగ్లా సహా ఇండియా మొత్తం విషపూరితమే

నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400కి మించి నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో గాలి 'తీవ్ర' స్థాయికి చేరుకుంది. అయితే చాలా చోట్ల AQI 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం 'వెరీ పూర్' కేటగిరీలోనే ఉంది.

NASA: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి గాలి చాలా వరకు విషపూరితంగా తయారైంది. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదట. ఢిల్లీ పరిసర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో విషపూరిత పొగలు అలుముకున్నాయట. ఇవి ఎంతలా వ్యాపించాయంటే.. విషపూరిత పొగ పాకిస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు వ్యాపించిందని నాసా విడుదల చేసిన చిత్రాలు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం నిండా పొగలు అలుముకున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నవి నవంబర్ 8వ తేదీ నాటివి. ఇక నవంబర్ 1 చిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో 8వ తేదీ కంటే తక్కువ విషపూరితమైన పొగ కనిపిస్తుంది. పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గత కొన్ని రోజులుగా తీవ్రమైన కేటగిరీలో ఉంది.

నాసా వరల్డ్‌వ్యూ నుంచి వచ్చిన విజువల్స్ భారతదేశంలోని మైదానాలను పొగమంచు దట్టమైన దుప్పటిని కప్పివేసినట్లు చూపించాయి. ఢిల్లీలో బుధవారం (నవంబర్ 8) 421 AQI నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరీకి చెందినది. పొరుగున ఉన్న ఘజియాబాద్‌లో గాలి నాణ్యత సూచిక 382, ​​గురుగ్రామ్ 370, నోయిడా 348, గ్రేటర్ నోయిడా 474, ఫరీదాబాద్ 396.

నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400కి మించి నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో గాలి ‘తీవ్ర’ స్థాయికి చేరుకుంది. అయితే చాలా చోట్ల AQI 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది గాలి నాణ్యతను కొలిచే సంఖ్య. దీని ద్వారా గాలిలో కాలుష్య స్థాయిని కూడా గుర్తిస్తారు. AQI రీడింగ్‌ల ఆధారంగా, గాలి నాణ్యతను ఆరు వర్గాలుగా విభజించారు. 0-50 గుడ్, 51-100 నార్మల్, 101-200 మిడిల్, 201-300 పూర్, 301-400 వెరీ పూర్, 401, 500 పైన తీవ్రంగా పరిగణిస్తారు.