Navjot Sidhu : నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు.. డబ్బుల కోసం తల్లినే అనాథగా వదిలేశాడు!
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ టూర్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ క్రూరుడని, డబ్బుల కోసం కన్నతల్లినే అనాథగా వదిలేశాడని ఆరోపించారు.
- Sreehari A
- Published on- January 28, 2022 / 03:20 PM IST
Suman Toor Allegations Navj
Navjot Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)పై ఆయన సోదరి సుమన్ టూర్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ ఒక క్రూరుడని, డబ్బుల కోసం కన్నతల్లినే అనాథగా వదిలేశాడని ఆమె ఆరోపించారు. సిద్ధూ సోదరి ఆరోపణలతో పంజాబ్లో రాజకీయ దుమారాన్ని రేపింది. సిద్ధూ సోదరి సుమన్ టూర్ (Suman Toor) అమెరికాలో నివసిస్తున్నారు.
సిద్ధూపై ఆమె చేసిన విమర్శలతో పంజాబ్ కాంగ్రెస్కు ఇబ్బందిగా మారాయి. అమెరికా నుంచి ఆమె మాట్లాడుతూ.. సిద్ధూ, డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడని విమర్శించారు. చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపారు. తమ తల్లి నాలుగు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉందని, సిద్ధూ అసలే పట్టించుకోలేదని సుమన్ ఆరోపణలు చేశారు.
సిద్ధూ ఓ క్రూరుడని, అతడిపై చేస్తున్న ఆరోపణలు అసత్యమైనవి కాదని తెలిపింది. తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని సుమన్ టూర్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తి సిద్ధూ అంటూ సోదరి సుమన్ ఆవేదన వ్యక్తం చేసింది. 1986 ఏడాదిలో తమ తండ్రి చనిపోయాడని, అప్పుడు తమ తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశాడని ఆమె వాపోయింది. తమ తల్లి 1989లో ఒక అనాథగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో చనిపోయిందని సోదరి సుమన్ టూర్ కన్నీటిపర్యంతమైంది. సిద్ధూ.. తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పినట్టు ఆమె ఆరోపణలు చేసింది.
గత జనవరి 20న సిద్దూని కలిసేందుకు పంజాబ్ వెళ్లానని తలుపులు తీయలేదని సుమన్ టూర్ పేర్కొన్నారు. ఇంటి బయటే తనను నిలబెట్టి అవమానించాడని ఆమె ఆరోపించింది. 70 ఏళ్లు ఉన్న తనకు సిద్ధూ ఫోన్ చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనాథగా రైల్వే స్టేషన్లో చనిపోయిన నా తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని సుమన్ టూర్ డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. సిద్ధూ సోదరి ఆరోపణలతో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలను మరింత వేడిక్కించాయి.
Read Also : Pushpa: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్.. ఎవరో తెలుసా?
