పోలీస్ డ్రస్సుల్లో నక్సల్స్ దోపిడీ  :బంగారం వ్యాపారిపై కాల్పులు 

  • Publish Date - May 8, 2019 / 06:10 AM IST

పాట్నా : పోలీస్ డ్రస్సుల్లో నక్సలైట్లు ఓ బంగారం వ్యాపారిపై  కాల్పులకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారం చేసే రాజు షా..ఆయన కుమార్తెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  బీహార్‌లోని మలయ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 

 150 మంది నక్సలైట్లు పోలీసుల డ్రస్సుల్లో రాజు షా ఇంటికి చేరుకున్నారు. అనంతరం 15 నుంచి 20 మంది నక్సల్స్‌ రాజు ఇంట్లోకి చొరబడ్డారు. బంగారంతో పాటు ఇంకా విలువైన వస్తువులను యదేచ్ఛగా దోచుకున్నారు. వీరిని అడ్డుకోవాలని ప్రయత్నించిన రాజు..ఆయన కుమార్తె  నిక్కి కుమార్తెపై కూడా కాల్పులకు పాల్పడ్డారు. అన్నీ దోచుకున్న అనంతరం వారు పరారయ్యారు. 

ఈ కాల్పుల్లో రాజు, నిక్కి కుమారి తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు సకాలంలో స్పందించలేదని వారు వాపోయారు