Supriya Sule: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. తప్పిన ప్రమాదం

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ సుప్రియా ట్వీట్‌ ద్వారా తన క్షేమ సమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్‌లో తెలిపారు. కాగా, సొంత నియోజవర్గం బారామతిలో పర్యటించేందుకు వచ్చిన సుప్రియా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, కరాటే పోటీల తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలకు వెళ్లారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

NCP MP Supriya Sule's saree catches fire at event in Pune

Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే చీరకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ఓ కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే సుప్రియాకు ప్రమాదమేమీ జరగలేదు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని సుప్రియా వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. పూణెలోని హింజవాడిలో కరాటే పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వేదికపై ఉన్న ఛత్రపతి శివాజీ చిన్న విగ్రహానికి పూలమాల వేస్తుండగా అక్కడే ఉంచిన దీపపు కుందెపై ఆమె చీర కొంగు పడింది. ఆ విషయం గ్రహించిన వెంటనే అప్రమత్తమపై సుప్రియా.. తన చేతులతోనే మంటలను ఆర్పేశారు.

Nirmala Sitharaman: నేను మధ్యతరగతే, వారి కష్టాలు తెలుసు.. బడ్జెట్‭పై ఆర్థిక మంత్రి నిర్మలా

దీంతో అక్కడున్న వారంతా తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ సుప్రియా ట్వీట్‌ ద్వారా తన క్షేమ సమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్‌లో తెలిపారు. కాగా, సొంత నియోజవర్గం బారామతిలో పర్యటించేందుకు వచ్చిన సుప్రియా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, కరాటే పోటీల తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలకు వెళ్లారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో ఉండగానే 1,500 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారట!