Nepal Flood : నేపాల్ విషాదం.. 469 మందికి చేరిన మృతుల సంఖ్య.. 14వేల మంది ఆచూకీ గల్లంతు..
Nepal Flash Floods Updates : తాజా వివరాల ప్రకారం.. నేపాల్ లో వరద విధ్వంసం కారణంగా మృతుల సంఖ్య 469కు చేరింది. 1,468 మంది గల్లంతయ్యారు.
- Harish Thanniru
- Published on- August 28, 2026 / 09:09 AM IST
Nepal Flood
Nepal Flash Floods Updates : నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఎక్కడ చూసినా వరద విధ్వంసక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రుసువా జిల్లాలో కొన్ని అడుగుల ఎత్తున మొదలైన వరద, బుదర ప్రవాహం పోటెత్తి.. దిగువకు ప్రవహించింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వందల మంది జల సమాధి కాగా.. వేలాది మంది గల్లంతయ్యారు.
తాజా వివరాల ప్రకారం.. నేపాల్ లో వరద విధ్వంసం కారణంగా మృతుల సంఖ్య 469కు చేరింది. 1,468 మంది గల్లంతయ్యారు. వీరిలో వందల మంది విదేశీయులు ఉన్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ లో 288మంది భారతీయులు ఆచూకీ లభించడం లేదు. మరోవైపు టిబెట్‌లో ముగ్గురు మరణించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, వరద విధ్వంసం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇదిలాఉంటే.. తాజాగా.. చైనా కీలక హెచ్చరిక చేసింది. టిబెట్–నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చైనా లెవల్-4 హెచ్చరిక జారీ చేసింది. రెండు నదులు కలిసే ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ఓ అడ్డంకి సరస్సు (బారియర్ లేక్) గట్టు తెగిపోయే ప్రమాదం అధికంగా ఉందని, అదే జరిగితే దిగువ ప్రాంతాల్లో భారీగా వరదలు సంభవించే అవకాశం ఉందని బీజింగ్ హెచ్చరించింది.
