×
Ad

West Bengal Election 2021 : మహిళను ఎగతాళి చేయకు మోదీకి టీఎంసీ నేత సూచన

తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ డెరిక్ ఓబ్రియాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

  • Published On : May 2, 2021 / 07:01 PM IST

Tmc

Never Taunt A Woman : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితాలు వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ 165 స్థానాల్లో విజయం సాధించి..ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇంకా 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 294 స్థానాలకు 292 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. బెంగాల్‌లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం ఖాయమైంది.

ఈ సందర్భంగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ డెరిక్ ఓబ్రియాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. సంబంధించిన స్పీచ్ ను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారాయన. మమతా బెనర్జీని ఎగతాళి చేసిన విషయాన్న ఆయన ప్రస్తావించారు. ఓ ర్యాలీలో మమతాబెనర్జిపై ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తమ రాష్ట్రంలో, మరెక్కడైనాగాని ఇంకెప్పుడూ మహిళను ఎగతాళి చేయకు అని క్యాప్షన్ ఇచ్చారు.

Read More : నందిగ్రామ్ లో మమత ఓటమి..భాధపడనవసరం లేదన్న దీదీ