Mamata Banerjee నందిగ్రామ్ లో మమత ఓటమి..భాధపడనవసరం లేదన్న దీదీ

I Accept The Verdict Of People Of Nandigram Says Mamata Banerjee
Nandigram దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ లోని నందిగ్రామ్ లో సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలయ్యారు. 1622 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి మమతపై విజయం సాధించారు.
నందిగ్రామ్ లో ఓటమిపై మమత స్పందించారు. నందిగ్రామ్ ఓటమి గురించి భాధపడనవసరం లేదన్నారు. తాను ఓ ఉద్యమం కోసం పోరాడాను కాబట్టే నందిగ్రామ్ కోసం తాను స్ట్రగుల్ అయ్యానన్నారు. నందిగ్రామ్ ప్రజల తీర్పుని గౌరవిస్తానన్నారు. తాను ఓటమిని పట్టించుకోనన్నారు.నందిగ్రామ్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ఒక ఉద్యమం కోసం త్యాగం తప్పదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 221కి పైగా స్థానాల్లో విజయం సాధించిందన్నారు. బెంగాలీలు దేశాన్ని కాపాడారన్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో డర్టీ పాలిటిక్స్ చేశారన్నారు. ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ అధికార ప్రతినిధిలా పనిచేసిందన్నారు. ఏకపక్ష విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మమత… కోవిడ్-19పై తాను తక్షణమే పని ప్రారంభించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమం సాధారంగానే జరుగుతుందని మమత తెలిపారు. మరోవైపు, నందిగ్ర్రామ్ లో రీకౌంటింగ్ జరపాలని టీఎంసీ పట్టుబడుతోంది.
కాగా, ఎన్నో ఏళ్లుగా నందిగ్రామ్..సువెందు అధికారి కుటుంబానికి పెట్టని కోటగా ఉంది. మమతకు సన్నిహితంగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లారు. అయితే మమత ఆయనపైనే పోటీ దిగుతానని పట్టుబట్టి బరిలోకి దిగారు. చివరికి సువెందు అధికారిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మమతని 50వేల ఓట్ల మెజార్టీతో ఓడించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువెందు గతంలో శపథం చేసిన విషయం తెలిసిందే.