Gujarat : నూతన వధూవరులను, కుటుంబసభ్యులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

వల్సాద్ పట్ణణంలో ఇన్స్ పెక్టర్, అతని బృందాలు రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 12 .30 గంటలకు వస్తున్న మూడు వాహనాలను...

Gujarat : నూతన వధూవరులను, కుటుంబసభ్యులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

Corona

Updated On : January 26, 2022 / 6:58 PM IST

Newly Wed Couple Arrest : పెళ్లి చేసుకుని వెళుతున్న నూతన వధూవరులను.. వారి కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ.. కుటుంసభ్యుల్లో ఒకరు ఆరోపణలు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రికి లేఖ రాశారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. ఇంతకు వాళ్లు ఏం నేరం చేశారనేగా మీ డౌట్. రాత్రి సమయంలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఓ గంట అనంతరం వారిని బెయిల్ పై విడుదల చేశారు.

Read More : Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?

మంగళవారం వల్సాద్ పట్ణణంలో ఇన్స్ పెక్టర్, అతని బృందాలు రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో గుజరాత్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 12.30 గంటలకు వస్తున్న మూడు వాహనాలను ఆపారు. వాహనాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటతో పాటు వారి కుటుంబసభ్యులున్నారు. ఏడుగురిని వల్సాద్ పీఎస్ కు తీసుకెళ్లి ఐపీసీ సెక్షన్ 188 (పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం), 269 (కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం) అభియోగాలు మోపారు. అరెస్టు అయిన వారిలో కౌన్సిలర్, వల్సాద్ మున్సిపాల్టీ మాజీ అధ్యక్షులు రాజేష్ పటేల్, అతని సతీమణి మీరా పటేల్ ఉన్నారు. వల్సాద్ మున్సిపాల్టీ కౌన్సిలర్ వికాష్ పటేల్ కూడా ఉన్నారు. ఘటనపై రాష్ట్ర హోం మంత్రికి, సూరత్ రేంజ్ ఐజీపీలకు రాజేష్ పటేల్ లేఖ రాశారు. పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని, వల్సాద్ టౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Read More : Sundar Pichai : గూగుల్​ సీఈఓ​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు..!

పెళ్లి తేదీని నెల రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగిందని, అయితే కొద్ది రోజుల క్రితమే నైట్ కర్ఫ్యూ విధించారని రాజేష్ పటేల్ తెలిపారు. దంపతులను ఇంటికి వెళ్లనివ్వాలని కోరినా..పోలీసులు నిరాకరించారని ఆరోపించారు. పోలీసులపై విచారణకు ఆదేశించారు సూరత్ రేంజ్ ఐజీ రాజ్ కుమార్ పాండియన్. కోవిడ్ 19 ఇన్ ఫెక్షన్లు ఎక్కువ కావడంతో గుజరాత్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫూ ఇతర ఆంక్షలు విధించింది. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, గాంధీనగర్, జునాఘడ్, జామ్ నగర్, భావ్ నగర్, ఆనంద్, నదియాడ్ లలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.