Ranjith Reddy IT Raids: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదారులు (IT Raids) నిర్వహిస్తున్నారు.

Ranjith Reddy IT Raids: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.

Ranjith Reddy IT Raids:

Updated On : August 19, 2025 / 12:34 PM IST

Ranjith Reddy IT Raids: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదారులు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. (Ranjith Reddy IT Raids)

రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూపు కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. డీఆర్ఎస్ గ్రూపులో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలోనూ, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాలతోపాటు ఏక కాలంలో 10చోట్ల వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణతోపాటు డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి ఏపీ, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Telangana bandh : ఈనెల 22న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ