Nanded Accident: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టాటా మ్యాజిక్.. 9 మంది దుర్మరణం!

మహారాష్ట్రలోని నాందేడ్(Nanded Accident) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Nine people died in horrific road accident in Nanded, Maharashtra.

  • నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం
  • ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం

Nanded Accident: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ముఖాముఖి ఢీకొనడంతో క్షణాల వ్యవధిలోనే రోడ్డు రక్తసిక్తమైంది. నాందేడ్-భోకర్ (Nanded Accident)హైవేపై వాకడ్ గ్రామం సమీపంలోని సీతాఖండి ప్రాంతంలో సాయంత్రం వేళ చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భోకర్ నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వస్తున్న ఒక ట్రక్కు.. ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వ్యాన్‌ను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Varun Tej Son: కొడుకు ‘వాయువ్ తేజ్’ను పరిచయం చేసిన వరుణ్ తేజ్- లావణ్య.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి!

మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం.. ముగ్గురి పరిస్థితి విషమం:

ప్రమాద సమయంలో టాటా మ్యాజిక్ వ్యాన్‌లో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రమైన ఢీకొనడం వల్ల 9 మంది ఘటనాస్థలిలోనే మృతి చెందగా, వారి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని భోకర్, నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఢీకొన్న తీవ్రతకు ట్రక్కు క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను పోలీసులు శ్రమించి బయటకు తీశారు. మృతులంతా స్థానికులేనని అనుమానిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.