new Covid strain: సింగపూర్ లో కొత్త కరోనా రకం లేదంటూ కేజ్రీవాల్‌కు కౌంటర్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ సింగపూర్ లో గుర్తించారని.. ఆ దేశస్థులు ఇండియాకు రాకుండా విమానాలను ఆపేయాలంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.

Kejiriwl Singapore

new Covid strain: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ సింగపూర్ లో గుర్తించారని.. ఆ దేశస్థులు ఇండియాకు రాకుండా విమానాలను ఆపేయాలంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. కొద్ది రోజుల కిందట B1.617.2వేరియంట్ ఇండియాకు చెందినదేనంటూ కూడా ప్రచారం జరిగింది.

మంగళవారం కేజ్రీవాల్ కొత్త కరోనా రకం సింగపూర్ లో వైద్యులు గుర్తించారని.. దీని వల్ల పిల్లలకు చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా విమాన రాకపోకలు ఆ దేశం నుంచి నిలిపేయాలని, చిన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ చేసే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఢిల్లీ సీఎం చేసిన కామెంట్లపై సింగపూర్ హెల్త్ మినిస్ట్రీ రెస్పాండ్ అయింది. అటువంటి వేరియంట్లు ఏం ఇక్కడ లేవు. అందులో అసలు నిజం లేదు. రీసెంట్ గా కొద్ది వారాల నుంచి నమోదవుతున్న కేసుల్లో ఇండియాకు చెందిన B.1.617.2కొత్త రకమే నమోదవుతుంది’ అని చెప్పారు.

అంతకంటే ముందు కేజ్రీవాల్ ట్వీట్ లో.. ‘సింగపూర్ లో కనిపించిన కరోనా కొత్త రకం చాలా ప్రమాదకరం. ప్రత్యేకించి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా ఇండియాలో మూడో వేవ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే.. వెంటనే సింగపూర్ నుంచి వచ్చే ఎయిర్ సర్వీసులను క్యాన్సిల్ చేయాలి. వ్యాక్సిన్ విధానంలో పిల్లలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని హిందీలో ట్వీట్ చేశారు.