తినకూడదంట: మాంసాహారులంతా హంతకులే!!

గో మాంసం తినకూడదని దేశమంతా ఆంక్షలు ఉన్నాయి. అంతవరకే కాదు పూర్తిగా మాంసాహారమే మానేయాలంటూ ఆన్‌లైన్ బోధకులు చెప్పుకొస్తున్నారు. వారికి తోడు నెటిజన్లలో మాంసాహారంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు రకాల కామెంట్లతో ట్వీట్లు చేస్తున్నారు. ‘జంతువులు(మేక, కోడి మొదలైనవి) అన్ని పిల్లలతో సమానం. ఒక బిడ్డ మరో బిడ్డను చంపితే దేవుడు ఎన్నటికీ సంతోషించడు’ అంటూ స్పందిస్తున్నారు. 

ప్రస్తుతం నాన్ వెజిటేరియన్స్ ఆర్ కిల్లర్స్ NonVegetarians_Are_Killers అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లన్నింటిలో దాదాపు ఓ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేయడం గమనార్హం. సాధారణ జీవన సరళిలో మాంసాహారం అన్ని మతాల్లోనూ తినడం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కొందరినే టార్గెట్ చేస్తూ మాంసాహారం తినకండి. మతగ్రంథాల్లో తినొద్దనే ఉందనే లైన్లతో ప్రచారం చేస్తున్నారు. 

నాలుక రుచి కోసం జంతువును చంపడమనేది మహా పాపం.  దేవుడు అమాయక జీవులను చంపుకుతినమని మిమల్ని ఆజ్ఞాపించలేదు అని కామెంట్ చేస్తూ ఓ బాబా రాసిన పుస్తకాన్ని ఫ్రీగా పొందండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారి ట్వీట్లపై పలు ఆసక్తికర రిప్లైలు దర్శనమిస్తున్నాయి. ‘తోటకూర తింటావ్.. వేటకూర తింటావ్ రెండూ మూగ జీవులే కదా.. వాటిని చంపకూడదు.. వీటిని తినేయొచ్చా’ అంటూ సెటైరికల్ రిప్లై ఇస్తున్నారు.