యూరప్ కాదు ఇది కేరళ మాత్రమే.. ఇంటర్నెట్‌లో రచ్చ.. రచ్చ

Vagabhadananda Park: కేరళలో పార్క్ యూరోపియన్ సిటీని తలపిస్తుందంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు నెటిజన్లు. కొజికొడె జిల్లాలోని కరాక్కడ్ లో ఉన్న కొత్త వాగభాదానంద పార్క్‌ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర టూరిజం మినిష్టర్ కడకంపల్లి సురేంద్రన్ ప్రారంభించిన పార్క్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డిజైనింగ్ కొత్తగా ఉండటంతో తెగ పొగిడేస్తున్నారు.

పార్క్ స్పెషాలిటీ ఏంటంటే..
పార్క్‌లో విగ్రహాలున్నాయి. ఓపెన్ స్టేజ్ ఉంది. బ్యాడ్మింటన్ కోర్టు, ఓపెన్ జిమ్నాజియం, చిల్డ్రన్ పార్క్ లాంటివి చాలా ఉన్నాయి. దారులు, టాయిలెట్లు డిఫరెంట్‌గా డిజైన్ చేయడంతో దివ్యాంగులకు కూడా అనుకూలంగా ఉన్నాయి. పార్క్ లో దారులు, వీల్ ఛైర్లు ప్రయాణించడానికి అనువైన టైల్స్ ఏర్పాటు చేశారు.

ఈ ఫొటోలను మంత్రి కూడా షేర్ చేశారు. రీ డెవలప్‌మెంట్ తర్వాత ఇలా మారిందంటూ పోస్టు చేశాడు. కడకంపల్లి స్థానికులు కోఆపరేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ వల్లే ఇది సాధ్యమైంది. డిజైన్ బిగెనింగ్ నుంచి, లోకల్స్, ప్రాంతానికి సమీపంలో ఉండే వారి అభిప్రాయాలు సేకరిస్తున్నామని మినిష్టర్ చెప్పారు.

ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్టర్స్ కోఆపరేటివ్ సొసైటీ రూ.2.80కోట్లు ఖర్చు పెట్టి పార్కును ఒంచియాం-నాదపురం రోడ్ లో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి నేషనల్ హైవే వరకూ పొడిగించారు. ఈ పార్కును వాగభాదానందనే నిర్మించారు.