Not even once, JP Nadda hails PM Modi after 93rd episode of Mann ki Baat
JP Nadda: ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీపై విపక్షాలు చేస్తోన్న విమర్శలను బీజేపీ అధినేత జేపీ నడ్డా తిప్పి కొట్టారు. ఆదివారం కేరళలోని కొట్టాయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటి వరకు 93 మన్ కీ బాత్ కార్యక్రమాలు నిర్వహించారని, అయితే ఒక్కసారి కూడా అందులో రాజకీయాలు మాట్లాడలేదని ఆయన అన్నారు.
‘‘విపక్షాలు నోరు తెరిస్తే రాజకీయం చేస్తున్నామని అంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 అక్టోబర్ 3న మొదటి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి 93 కార్యక్రమాలు పూర్తైంది. ఇన్ని కార్యక్రమాల్లో ఒక్కసారైనా రాజకీయాల గురించి మోదీ మాట్లాడారేమో చూపించండి. దేశం గురించి, దేశ ప్రజల గురించే తప్పితే ఒక్క సారంటే ఒక్కసారి కూడా ఆ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడలేదు. మా రాజకీయాలకు ఇంతకంటే గుర్తింపు ఏం కావాలి?’’ అని నడ్డా అన్నారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమం 93వది.
Reel With Snake: పాముతో రీల్ చేయబోయిన సాధువు.. మెడకు చుట్టుకుని కాట్లు వేయడంతో..