Diabetes Insulin : మధుమేహం బాధితులకు శుభవార్త.. ఇక నుంచి వారానికి ఒక్కసారే ఇన్సులిన్.. భారత్ మార్కెట్లోకి విడుదల

Diabetes Insulin : ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ (Novo Nordisk) మధుమేహం బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాల్సిన ప్రపంచంలోని తొలి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవిక్లీ (Awiqli)ని భారత మార్కెట్లో విడుదల చేసింది.

diabetes insulin

Diabetes Insulin : భారత్‌లో మధుమేహం (డయాబెటిస్) బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 10.1కోట్లకుపైగా మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. అధికశాతం మధుమేహం బాధితులు ప్రస్తుతం ప్రతీరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న పరిస్థితి. కొందరు ఎక్కువ ఖర్చు కారణంతో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి వారికి డెన్మార్క్‌కు చెందిన ఔషద సంస్థ నోవో నోర్డిస్క్ శుభవార్త చెప్పింది.

Also Read : Bhupal Naik Scam : షేర్ బజార్ స్కాం.. హైదరాబాద్‌లో నిందితుడు అరెస్ట్.. అమెరికాలో యువతి యాక్సిడెంట్‌లో మృతి.. ఏం జరిగింది?

ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ (Novo Nordisk) మధుమేహం బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాల్సిన ప్రపంచంలోని తొలి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవిక్లీ (Awiqli)ని భారత మార్కెట్లో విడుదల చేసింది. 700 యూనిట్స్, 2,100 యూనిట్సై్ ఇంజెక్షన్ పెన్ ఆప్షన్లతో విడుదలైంది. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.3.73 ఉంటుందని నోర్డిస్క్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రాంత్‌ శ్రోత్రియా వెల్లడించారు. దీనిని టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వయోజనులకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఇన్సులిన్ వినియోగించే చాలా మంది మధుమేహం బాధితులు ప్రతిరోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తోంది. అయితే, అవిక్లీతో కేవలం వారానికి ఒకసారి మాత్రమే సరిపోతుంది. దీంతో చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బేసల్ ఇన్సులిన్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని, దేశంలోని 4,500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీస్తున్నట్లు నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. భారత్‌లో విడుదల చేయడం ద్వారా మొత్తం ఏడు దేశాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చినట్లయ్యిందని విక్రాంత్‌ వెల్లడించారు.