శివలింగం. సాక్షాత్తూ.. పరమశివుడే లింగ రూపంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంలా పూజలందుకుంటున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 21,2020) మహాశివరాత్రి సందర్భంగా ఓ వినూత్నమైన శివలింగాన్ని చెక్కాడు ఓ శిల్పి. శిల్పి అంటే రాళ్లతో శివలింగాన్ని చెక్కాడని అనుకోవద్దు. పెన్సిల్ నిబ్ పై శివలింగాన్ని చెక్కాడు ఆ శిల్పి. అతని పేరు ఎల్.ఈశ్వర్రావు. ఈశ్వర్రావుది ఒడిశాకు చెందిన ఖర్దా జిల్లాలోని జాట్ని గ్రామం.
అతను పెన్సిల్ ముల్లు (నిబ్)పై చెక్కిన అద్భుతమైన, అపరూపమైన 0.5 అంగుళాల శివలింగం ఎంతోమందిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ ఈ శివలింగాన్ని తయారు చేయటానికి రెండు రోజులు పట్టిందని తెలిపాడు.దాన్ని ఓ చిన్న సీసాలో పెట్టానని తెలిపాడు.
శివలింగాన్ని సీసాలో పెట్టే క్రమంలో అది విరిగిపోకుండా ఉండేందుకు నాలు చిన్న చిన్న రాళ్లును సీసీ అడుగు భాగంలోకి చేర్చి వాటిపై శివలింగాన్ని పెట్టి..తరువాత జాగ్రత్త ఒక్కొక్క రాయిని సీసాలోంచి తీసి వేసి శివలింగాన్ని జాగ్రత్తగా సీసీ అడుగు భాగంలోకి చేర్చానని చెప్పాడు.
Odisha: L Eswar Rao, an artist from Bhubaneswar’s Jatni, has made a miniature model of a ‘Shivling’, on a pencil nib. #MahaShivaratri (20.02.20) pic.twitter.com/eSu8zKCnAc
— ANI (@ANI) February 20, 2020