నలుగురు కూతుళ్లతో టాయ్‌లెట్‌లో జీవిస్తున్న మహిళ

  • Publish Date - December 10, 2019 / 06:12 AM IST

ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోంది. 

తన భర్త మరణించిన తరువాత..అత్యంత పేదరికంతో ద్రౌపది తన నలుగురు కుమార్తెలతో కలిసి టాయిలెట్ లోను జీవించాల్సిన దుర్భర దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగుతున్న ఈ క్రమంలో తన  ఆడబిడ్డలకు ఈ మరుగుదొడ్డి ఎంతవరకూ రక్షణనిస్తుంది అనే ఆందోళనలో వేరే దారి లేక..ఉండటానికి గూడు లేక మరుగుదొడ్డిలోనే జీవించాల్సిన దుర్భరపరిస్థితిలో కాలం వెళ్లదీస్తోంది.  

ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెపై గ్రామానికి చెందిన సర్పంచ్ అని బుధురామ్ పుటీ మాట్లాడుతూ..ఆమె పరిస్థితి చాలా దారుణమైనదనీ..ఆమెకు ఓ ఇల్లు నిర్మించేంత పరిస్థితి తమ పంచాయితీకి లేదనీ ప్రభుత్వ పథకాల ద్వారా ఒక ఇల్లు సాంక్షన్ అయితే చాలా సంతోషిస్తామని తెలిపారు.