Cyclone Yaas: తుఫానులో బయటికి ఎందుకొచ్చావని అడిగిన రిపోర్టర్‌కు దిమ్మతిరిగే రిప్లై

తుఫాన్ వచ్చేలా ఉంది. దానికి తోడు ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బయటికి ఎందుకు వచ్చావని అడిగిన రిపోర్టర్ కు ఓ వ్యక్తి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. వేగంగా వీస్తున్న గాలుల్లో ...

Reporter

Cyclone Yaas: తుఫాన్ వచ్చేలా ఉంది. దానికి తోడు ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బయటికి ఎందుకు వచ్చావని అడిగిన రిపోర్టర్ కు ఓ వ్యక్తి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. వేగంగా వీస్తున్న గాలుల్లో బయటికొచ్చిన వ్యక్తిని ఆపిన రిపోర్టర్ ఎందుకొచ్చావ్.. యాస్ తుఫాన్ రాబోయేలా ఉంది. వేగంగా గాలులు వీస్తున్నాయని అడిగాడు.

భయానక వాతవరణంలో బయటికి రావడానికి కారణమేంటో చెప్పడంతో వైరల్ అయిపోయింది ఆ వీడియో.. ఆ డైలాగ్ ను ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేసి పోస్టు పెట్టాడు.

‘తేజ్ హవా చల్ రహా హై, తుఫాన్ ఆనే వాలా హై.. తో ఆప్ ఘర్ సే క్యోం నిక్లే హై’ (తుఫాన్ వచ్చేలా ఉంది. బలంగా గాలులు వీస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు ఎందుకొచ్చావ్’ అని రిపోర్టర్ అడిగాడు.

దానికి సమాధానమిచ్చిన వ్యక్తి. నేనెందుకు బయటకు వచ్చానంటే నువ్వు కూడా వచ్చావ్ కాబట్టి.

రిపోర్టర్ రెస్పాండ్ అవుతూ న్యూస్ కవర్ చేయడం కోసమే తాను వచ్చినట్లు చెప్పాడు. ‘(హమ్ నహీ నిక్లే తో ఆప్ కిస్కో దిఖాయేంగే) మేం బయటకు రాకపోతే మీరు ఎవర్ని చూపిస్తారు’ అని వెంటనే చెప్పాడు.

ఈ సీన్ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ‘ఎంత దయార్ధ్ర హృదయం గల వ్యక్తి. మానవత్వం కోసం ఎంత చేస్తున్నాడో.. గౌరవించాలి’ అని ఐపీఎల్ అరుణ్ బోత్రా ట్వీట్ చేశాడు.