LPG Subsidy Cut : గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. వారందరికీ ఇకపై సబ్సిడీ కట్.. ఏడు రోజులే అవకాశం?

LPG Subsidy Cut : ఆదాయపు పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పన్నువర్తించే వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందని.. మీరు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదంటూ పలు ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు కొద్దిరోజులుగా ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి.

LPG Subsidy Cut

LPG Subsidy Cut : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. దీంతో దేశంలో గ్యాస్ కొరత సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచాయి. ఇదే క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసే దిశగా చమురు కంపెనీలు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వార్షిక ఆదాయం రూ.10లక్షలకు పైబడి ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తారని తెలుస్తోంది.

Also Read : CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తీవ్ర విమర్శల వేళ ఓఎస్డీ నియామకం రద్దు..

ఆదాయపు పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పన్నువర్తించే వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందని.. మీరు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదంటూ పలు ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు కొద్దిరోజులుగా ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి.

ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ గృహ వినియోగదారుల్లో తొలుత ఆదాయపు పన్ను చెల్లించేవారికి సబ్సిడీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై వినియోగదారులకు రూ.40 సబ్సిడీ లభిస్తోంది.

ఆదాయపు పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి సారించింది. రేషన్ కార్డుదారుల ఆధార్ సంఖ్య, ఈకేవైసీ వివరాలతో ఆదాయపు పన్ను చెల్లింపు సమచారాన్ని విశ్లేషిస్తోంది. ఆదాయపు పన్ను కట్టేవారి రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ లో సబ్సిడీ తీసేసే ప్రక్రియను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో కేంద్ర ప్రభుత్వం గివ్ ఇట్ అప్ పేరుతో స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని కోరింది. రాష్ట్రంలో పలువురు వదులుకున్నారు. ఇప్పుడు ఆయిల్ కంపెనీలే నేరుగా సబ్సిడీకి స్వస్తి చెప్పే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.