Oldest Tiger: కాలం చేసిన ఇండియాలోనే పెద్ద వయస్సున్న పులి

ఇండియాలోనే 25 సంవత్సరాల వయస్సున్న పులి (రాజా) సోమవారం మరణించినట్లు SKB రెస్క్యూ సెంటర్ వెల్లడించింది. "ఈ విషయాన్ని బాధాతప్త హృదయంతో ఇన్ఫామ్ చేస్తున్నాం. ఎస్కేబీ రెస్క్యూ సెంటర్ లో ఉదయం 3గంటల సమయంలో మృతి చెందింది.

 

 

Oldest Tiger: ఇండియాలోనే 25 సంవత్సరాల వయస్సున్న పులి (రాజా) సోమవారం మరణించినట్లు SKB రెస్క్యూ సెంటర్ వెల్లడించింది. “ఈ విషయాన్ని బాధాతప్త హృదయంతో ఇన్ఫామ్ చేస్తున్నాం. ఎస్కేబీ రెస్క్యూ సెంటర్ లో ఉదయం 3గంటల సమయంలో మృతి చెందింది. 25సంవత్సరాల 10నెలల వయస్సున్న రాజా.. దేశంలోనే పెద్దదైన పులుల్లో ఒకటి” అని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.

2008 ఆగష్టులో నార్త్ బెంగాల్ లోని దక్షిణ ఖైర్బారీ టైగర్ రెస్క్యూ సెంటర్ నుంచి రాజాను తీసుకొచ్చారు. ఆ సమయంలో మొసలితో ఘర్షణ జరగ్గా పదికి పైగా గాయాలయ్యాయి. వెటర్నరీ డాక్టర్ ప్రళాయ్ మండల్, వైల్డ్ లైఫ్ గార్డ్ పార్థ సారథి సిన్హా, ఇతర స్టాఫ్ మెంబర్లు కలిసి దాని సంక్షేమాన్ని చూసుకున్నారు.

దక్షిణ ఖైర్‌బారి రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చినప్పుడు రాజా వయస్సు దాదాపు 11 సంవత్సరాలు. అక్కడే మరో 15 సంవత్సరాలు జీవించి, దేశంలో జీవించి ఉన్న పురాతన పులులలో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనతో తామంతా శోక సంద్రంలో ఉన్నామని అధికారులు వెల్లడించారు.

Read Also: ఖిలాడీ టైగర్.. జీడిమామిడితోటలో పులి పాదముద్రలు

అలీపుర్‌దువార్‌ జిల్లా మేజిస్ట్రేట్‌, సురేంద్ర కుమార్‌ మీనా, జలదపారాలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, దీపక్‌ ఎం, ఇతర అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, జూ సిబ్బంది రాజాకు నివాళులర్పించారు.

ట్రెండింగ్ వార్తలు