Amit Shah : టార్గెట్ అమిత్ షా..! అందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్..

Amit Shah : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఛలో సంసద్ ర్యాలీలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ బాధ్యత వహించాలంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

Amit Shah

Amit Shah : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో పెద్దెత్తున విద్యార్థులు, యువత ఢిల్లీలో జింతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. పలుసార్లు ఆందోళనలు ఉద్రిక్తతంగా మారాయి. పోలీసులు విద్యార్థులపై లారీ ఛార్జీసైతం చేయాల్సి వచ్చింది. ఈ ఆందోళనలు రోజురోజుకు ఉధృతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి దేర్మద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం సీజేపీ లేవనెత్తిన మరో రెండు డిమాండ్లకు అంగీకారం తెలిపింది. నిరసనల్లో పాల్గొన్నవారిపై కేసులు తొలగింపుతోపాటు.. నీట్ పరీక్షల వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో ప్రస్తుతానికి ఆందోళనలను సీజేపీ విరమించుకుంది. అయితే, మరోసా ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read : Jantar Mantar Protest : ఢిల్లీ నిరసనలపై షాకింగ్ రిపోర్ట్.. 2,873 మంది నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించిన పోలీసులు

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఛలో సంసద్ ర్యాలీలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ బాధ్యత వహించాలంటూ విపక్షాలు పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళన చేపట్టాయి. విద్యార్థులపై జరిగిన బలప్రయోగంపై అమిత్ షా స్వయంగా ఉభయ సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి.

జులై 20న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని, సాధారణ కార్యక్రమాలను నిలిపివేసి దీనిపై అత్యవసర చర్చ చేపట్టాలని రాజ్యసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానిలిచ్చింది. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనకు కేంద్ర హోమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలంటూ విపక్ష సభ్యులు సోమవారం వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు.

మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రూల్–267 కింద నోటీసు ఇచ్చి, విద్యార్థులపై జరిగిన పోలీసు బలప్రయోగంపై అన్ని కార్యక్రమాలను నిలిపివేసి తక్షణ చర్చ చేపట్టాలని కోరారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభా నిబంధనల ప్రకారం రూల్–267 కింద ఈ అంశాన్ని అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగించారు.

మరోవైపు.. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు సోమవారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోని ముఖద్వారం వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల ఉద్యమంపై పోలీసుల బలప్రయోగానికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.