Rock Dam : పాకిస్థాన్‌కు భారీషాక్.. లద్దాఖ్‌లో భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే?
India Builds First Rock Dam : లద్దాఖ్‌లోని ఉప్పీ ప్రాంతంలో సింధూ నదిపై సిమెంట్ వినియోగం లేకుండా భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. సిమెంట్, కాంక్రీట్ ఉపయోగించకుండా సహజ రాళ్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
India Builds First Rock Dam On Indus At Upshi in Ladakh
India Builds First Rock Dam : సింధూ నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు భారత్ నిర్ణయించింది. దీంతో లద్దాఖ్‌లోని ఉప్పీ ప్రాంతంలో సింధూ నదిపై సిమెంట్ వినియోగం లేకుండా భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. సిమెంట్, కాంక్రీట్ ఉపయోగించకుండా సహజ రాళ్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
ఈ రాతి చెక్‌డ్యామ్ వలన సింధూ నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో గతంలో నదిలో నీరు లోతుగా ప్రవహించడం వల్ల పంపుల ద్వారా నీటిని తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ చెక్ డ్యామ్ సుమారు 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది. నిల్వ చేసిన నీటిని ఇగూ-ఫే (Igoo-Phey) సాగునీటి కాలువ ద్వారా పొలాలకు తరలించనున్నారు. ముఖ్యంగా వసంతకాలంలో విత్తనాలు వేసే సమయంలో నీటి కొరతను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా లభించే సహజ బండరాళ్లతో తక్కువ వ్యయంతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ను పర్యావరణహిత పరిష్కారంగా అధికారులు భావిస్తున్నారు. ఈ చెక్ డ్యామ్ కారణంగా లడఖ్ వంటి ఎత్తైన ఎడారి ప్రాంతంలో వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం చాలా కాలంగా సవాలుగా మారింది. ఉప్సీ ప్రాంతంలోని చెక్‌డ్యామ్ తరహాలో లడఖ్‌లో మరో 36 రాక్ చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లద్దాఖ్ యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.56 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇవి పూర్తయితే వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
మరోవైపు, భారత్–పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty)పై వివాదం కొనసాగుతున్న సమయంలో సింధూ నది నీటిని లడఖ్‌లో స్థానిక అవసరాలకు వినియోగించే దిశగా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయపరమైన పరిణామాలు కూడా కొనసాగుతున్నాయి.
Inaugurated the first of its kind Rock Check Dam on River Sindhu in Leh, under the ambitious “Sindhu Jal Samriddhi Abhiyan”, conceived as a sustainable, cost-effective solution for water and agricultural sustainability in Ladakh.
Unlike the traditional concrete check dams, this… pic.twitter.com/Uecid2aZyT
— LG Ladakh (@lg_ladakh) May 27, 2026
