మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు పిలవాలంటే ‘మోడీ’ అని పిలవండి అంటు బోర్డులు పెట్టారు. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఇది మధ్యప్రదేశ్‌లోని మొరేనాలోని రామ్‌నగర్ కాలనీలో పలు ఇళ్లముందు కనిపించే ఆసక్తి కర నోటీసుల చిత్రం వైరల్ గా మారింది.
ఆ కాలనీలో ఉండే 100 ఇంటికి ఈ నోటీసులు స్టిక్ చేశారు. ‘డోర్ బెల్ పాడయ్యింది. తలుపులు తీసేందుకు దయచేసి ‘మోడీ, అని పిలవండి లేదా అరవండి’ అని రాసివుంది. దీనికి వారేం చెబుతున్నారంటే..ఎవరైనా వచ్చి తమను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నామన్నామని అంటున్నారు. అంతేకాదు..మోడీప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు మెచ్చుకోలుగా ఇలా తాము నినదిస్తున్నామని తెలిపారు.
కాగా దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి విడత పూర్తయ్యింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 29న 6 లోక్ సభ స్థానాలకు, మే 6న 7 లోక్‌సభ స్థానాలకు, మే 12న 8 లోక్ సభ సీట్లకు ఓటింగ్ జరగనుంది. చివరగా మే 19న 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో మోడీపై అభిమానంతో ఆ కాలనీ వాసులంతా ఇలా తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించారు.