చీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా సభ్యులు చేరారు. సోషల్ మీడియా అకౌంట్లో మిస్ కాల్ ఉంచడమే దీనికి ముఖ్య కారణం.
కేవలం మిస్ కాల్ ఇవ్వండి చాలు అని సులువుగా సభ్యత్వం పొందే పద్ధతిని నెటిజన్ల ముందుంచింది ఆప్.
* 2020, ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ (70 స్థానాలు) ఎన్నికలు జరిగాయి.
* 2020, ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల లితాలు విడుదలయ్యాయి.
* ఈ ఎన్నికల్లో ఆప్‌కు 62సీట్లు వచ్చాయి.
* బీజేపీ కేవలం 8సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
* కాంగ్రెస్ ఎక్కడా విజయం సాధించలేదు.
* 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు.
* 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
* కొత్త రాజకీయాలకు ఇది ప్రారంభమని, ఇది కొత్త సంకేతమని కేజ్రీవాల్ అన్నారు. కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
* 2020, ఫిబ్రవరి 16వ తేదీన కేజ్రీవాల్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
हाथ में झाड़ू, सर पर बापू वाली टोपी पहने हम आये हैं
आम आदमी आये हैं, आम आदमी आये हैं।Relive the 2020 campaign of Aam Aadmi pic.twitter.com/liKqlm4G6o
— AAP (@AamAadmiParty) February 13, 2020