Nupur Sharma: నుపుర్ శర్మను హత్యచేసేందుకు వచ్చిన పాకిస్థానీ అరెస్ట్.. వెంట ఏం తెచ్చుకున్నాడంటే!
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తిని ఐబీ, ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
- Harishth Thanniru
- Published On : July 19, 2022 / 07:03 PM IST
Napur Sharma
Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో హిందు మాల్కోట్ బోర్డర్ అవుట్ పోస్ట్ వద్ద అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అతడిని విచారించింది.
Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు
విచారణలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. అతడి పేరు రిజ్వాన్ అష్రఫ్ అని, పాకిస్థాన్ లోని నార్తన్ పంజాబ్ లోని మండీ బహుద్దీన్ పట్టణానికి చెందిన వాడిగా చెప్పాడని తెలిపారు. అయితే నుపుర్ శర్మను చంపేందుకు సరిహద్దు దాటి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. అనుకున్న ప్రకారం నపుర్ శర్మను హత్యచేసిన అనంతరం అజ్మీర్ దర్గాను సందర్శించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని విచారణలో రిజ్వాన్ అష్రఫ్ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
Nupur Sharma: నుపుర్ శర్మను అంతమొందించాలని భారత్‌లోకి పాకిస్తానీ..
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రిజ్వాన్ అష్రఫ్ నపుర్ శర్మను హతమార్చేందుకు తన వెంట ఓ బ్యాగ్ ను తెచ్చుకున్నాడు. ఈ బ్యాగ్ లో 11అంగుళాల పొడవైన కత్తి, మతపరమైన సాహిత్యం, బట్టలతో పాటు ఆహారం, ఇసుకను గుర్తించారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నపుర్ శర్మను చంపాలని అనుకున్నానని విచారణలో రిజ్వార్ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన తర్వాత స్థానిక పోలీసులు మెజిస్ట్రేట్ ఎధుట హాజరుపరచడంతో ఎనిమిది రోజులు పోలీస్ కస్టడీ విధించారని, నిందితుడిని ఐబీ, రా, మిలటరీ ఏజెన్సీలతో కూడిన సంయుక్త బృందం విచారించనున్నట్లు సమాచారం.
