Nupur Sharma: నుపుర్ శర్మను అంతమొందించాలని భారత్‌లోకి పాకిస్తానీ..

పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఇండియాలోకి చొరబడి భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన నుపుర్ శర్మను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ 24ఏళ్ల పాకిస్తానీ రిజ్వాన్ షరీఫ్ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు బోర్డర్ సెక్యూరిటీ అదుపులో ఉన్నాడు.

Nupur Sharma: నుపుర్ శర్మను అంతమొందించాలని భారత్‌లోకి పాకిస్తానీ..

Nupur Sharma: పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఇండియాలోకి చొరబడి భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన నుపుర్ శర్మను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ 24ఏళ్ల పాకిస్తానీ రిజ్వాన్ షరీఫ్ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు బోర్డర్ సెక్యూరిటీ అదుపులో ఉన్నాడు. హిందూమల్కోట్ సెక్టార్ లోని ఖఖన్ చెక్ పోస్ట్ గుండా భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అందింది.

పాకిస్తాన్ లోని మండీ బహౌద్దీన్ లో ఉండే అష్రఫ్ ముఖ్య ఉద్దేశ్యం చాలా ప్రమాదకరంగా ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంటరాగేషన్లో తాను బీజేపీ లీడర్ నుపుర్ శర్మను అంతమొందించడానికి వచ్చినట్లు వెల్లడించాడు. మొహమ్మద్ ప్రవక్తపై ఆ లీడర్ చేసిన వ్యాఖ్యలకు గానూ తాను ఈ హత్య చేయాలనుకున్నట్లు పేర్కొన్నాడు.

ఇండియాలోకి చొరబడిన తర్వాత తనకు భయం వేసిందని శ్రీగంగా నగర్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి ప్రార్థన చేసుకున్న అనంతరం నుపుర్ శర్మను హత్య చేసేందుకు ప్లాన్ వేసుకోవాలని అనుకున్నాడట. ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్న అష్రఫ్‌కు ఉర్దూ, పంజాబీ, హిందీ భాషలు తెలుసు. ప్రస్తుతం అతని వద్ద ఎటువంటి ఆయుధాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

Read Also: నుపుర్ శర్మ తల తెస్తే ఆస్తి రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్

నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం పాకిస్తాన్ లో కొందరు మీటింగ్ నిర్వహించారట. ఆ మీటింగ్ కు వెళ్లిన అష్రఫ్ రిజ్వాన్ నుపుర్ ను అంతమొందించాలని ఫిక్స్ అయ్యాడట.