ఢిల్లీ : ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. పాకిస్తాన్ అధికారులు అతని భారత్ కు అప్పగించారు. వాఘా సరిహద్దులో ఐఏఎఫ్ అధికారులకు అప్పగించారు. అభినందన్ కు భారత జవాన్లు స్వాగతం పలికారు. వాఘా సరిహద్దులో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అభినందన్ రాకతో దేశ్యవాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. అభినందన్ ను అధికారులు అమృత్ సర్ కు తరలించారు. అభినందన్ అటారీ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ ఆర్ జీకే కపూర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పాక్ తమకు అభినందన్ ను అప్పగించిందని తెలిపారు. అభినందన్ శరీరం చాలా అలిసిపోయిందన్నారు. వైద్య పరీక్షల కోసం అభినందన్ ను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అతనికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.