Parasailing Mumbai
Parasailing Rope Breaks : పారాసెయిలింగ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా తాడు తెగిపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే..కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూలో పారాసెయిలింగ్ చేసిన ఓ జంట..సముద్రంలో పడిపోయారు. సముద్రంపై ఎగురుతుండగా..తాడు తెగిపోవడంతో..దంపతులు సముద్రంలో పడిపోయారు. కానీ..వీరికి లైఫ్ జాకెట్లు ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తాడుకు తెగిపోయిన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా…ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.
Read More : Omicron Victim : రాజన్న సిరిసిల్ల ఒమిక్రాన్ బాధితుడి కుటుంబానికి కరోనా పాజిటివ్
ముంబాయిలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడకు చేరుకున్న అనంతరం వారికి లైఫ్ జాకెట్లు, ఇతరత్రా ధరించి వేశారు. అనంతరం వారిని మెల్లిగా గాల్లోకి లేపారు సిబ్బంది. సముద్రంపై ఎత్తున్న ఎగురుతుండగా..ఆ ఇద్దరు మహిళలు ఫుల్ ఎంజాయ్ చేశారు. కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత..హాఠాత్తుగా తాడు తెగిపోవడంతో ఆ ఇద్దరు మహిళలు భయపడిపోయారు. అమాంతం సముద్రంలో పడిపోయారు. లైఫ్ జాకెట్లు ఉండడంతో వారు నీటిపై తేలిపోయారు. ఏదైనా అయి ఉంటే..అని భయపడిపోయారు. ప్రస్తుతం పారాసెయిలింగ్ లో జరుగుతున్న ప్రమాదాలు చర్చనీయాంశమవుతున్నాయి.