Parmish Verma : చిన్నారి కోసం షో నిలిపివేసిన సింగర్ పర్మిష్ వర్మ.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసల వర్షం

Parmish Verma : పంజాబీ గాయకుడు, నటుడు పర్మిష్ వర్మ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పర్మిష్ వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

parmish verma

Parmish Verma : పంజాబీ గాయకుడు, నటుడు పర్మిష్ వర్మ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై పర్మిష్ వర్మ ప్రదర్శన కొనసాగుతోంది.. ఈ క్రమంలో ఓ చిన్నారిని ఒంటరిగా ఏడుస్తూ ఉండటాన్ని పర్మిష్ వర్మ గమనించాడు. వెంటనే షోను నిలిపివేసి.. ఆ చిన్నారిని తన వద్దకు తీసుకురావాలని భద్రత సిబ్బందికి ఆదేశించాడు. అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులను గుర్తించి వారికి ఆ చిన్నారిని అప్పగించేంత వరకు పర్మిష్ వర్మ స్వయంగా బాధ్యత తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Iran War Cost 132 Billion Dollars : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ..! అమెరికా ఖజానాను కుదిపేసిన యుద్ధం.. 132 బిలియన్ డాలర్ల భారం

వైరల్ పోస్టుల ప్రకారం.. భారీగా తరలివచ్చిన జనసంద్రోహం మధ్య చిన్నారి తల్లి మొబైల్ ఫోన్‌తో ఫొటోలు తీయడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆమె నుంచి పక్కకు వెళ్లిపోవటంతో తప్పిపోయింది. చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన పర్మిష్ వర్మ షోను నిలిపివేసి భద్రత సిబ్బంది సహాయంతో ఆ చిన్నారిని స్టేజీపై ఉన్న తనవద్దకు రప్పించుకున్నాడు. ఆ చిన్నారిని తన చేతులతో ఎత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను కొనుగొనేందుకు సహాయం చేయాలని తన బృందానికి, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత ఒక మహిళ ముందుకు వచ్చి, తానే ఆ బిడ్డ తల్లి అని పరిచయం చేసుకుంది. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆమె వీడియోలు రికార్డ్ చేస్తూ, ఫోటోలు తీయడంపై దృష్టి సారించగా, ఆ సమయంలో బిడ్డను ర్యాంప్ దగ్గర వదిలిపెట్టిందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

వేదికపై నుంచి ఆ మహిళను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ.. బిడ్డ ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రద్దీగా ఉండే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. అటువంటి ప్రదేశాలలో పిల్లల పట్ల శ్రద్ధగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పర్మిష్ వర్మ పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.